నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి బర్మా కాలనీలో ఒక ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.4,39,743 విద్యుత్ బిల్లు రావడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఈ బిల్లు చెల్లించాలంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో వారు విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించగా, అది సాఫ్ట్‌వేర్ లోపం వల్ల జరిగిందని తేలింది. అనంతరం సాంకేతిక సమస్యను సరిచేసి, అసలు బిల్లు రూ.15,205 అని తేల్చడంతో ఆశ్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

The post వృద్ధాశ్రమానికి రూ.4.3 లక్షల విద్యుత్‌ బిల్లు appeared first on Navatelangana.