స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన K సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. కంపెనీ దీనిని ఒప్పో K15 పేరిట చైనాలో జూలై 24న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో విడుదలైన ఒప్పో K15 ప్రో, ఒప్పో K15 ప్రో ప్లస్ మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.


ధర ఎంత ఉండవచ్చు?

ఒప్పో K15 ధరకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ జూలై 24న జరిగే లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రే, వైట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది.

ఫీచర్లు( అంచనా)

డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. అలాగే IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.

ప్రాసెసర్: పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌తో పాటు టైడల్ ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది.

కెమెరా: ఫోటోగ్రఫీ కోసం ఒప్పో K15లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు.

భారీ బ్యాటరీ: ఒప్పో K15లో 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీను అందించనున్నారు. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కువసేపు గేమింగ్ లేదా హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్తో పాటు 4,950 చదరపు మిల్లీమీటర్ల వెపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ను అమర్చారు.