
న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ.. అవి వీగిపోయాయి. పేవర్ లీక్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధనలు రూపొందించామని తెలిపింది. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.











