గన్నవరం: యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసేఫ్) రిమాండ్‌ను గన్నవరం కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో రావణ్ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో అతడిని అధికారులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. పలువురు ప్రముఖులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, సోషల్‌మీడియాలో వీడియోలు పోస్టులు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అతడి మొబైల్‌లో మావోయిస్టులను పొగుడుతూ చేసిన వీడియోలు ఉండటంతో దేశ ద్రోహం, ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు.