5392 articles





హుస్నాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ ఆడిషన్ కలెక్టర్ లు, ఆర్డీవో లు , డిఎస్ఒలు, డిఎం సివిల్ సప్లయ్ అధికారులు, ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులు ,ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంచార్జీలు, గ్రామాల వారిగా ధాన్యం కొనుగోలు కమిటీలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోవాలని, సాయంకాలం వర్షాలు ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం ఇటీవల వర్షానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ప్రతి గ్రామానికి వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కొనుగోలు కేంద





హైదరాబాద్: బెంగాల్ లో బిజెపి ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీవి పగటి కలలు కంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలో అధికారం కావాలని అడ్డదారిలో ప్రయత్నిస్తున్నారని, బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించారని బీర్ల ఐలయ్య విమర్శించారు. బిజెపి, బిఆర్ఎస్ కలిసొచ్చినా కాంగ్రెస్ కు పోటీ కాలేరని, మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని..సిఎం అయ్యేది రేవంత్ రెడ్డి అని బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.




చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. సాంప్రదాయ పద్దతిలో చీరకట్టులో ఆమె అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. విజయ్, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని టాక్ ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి ఐదు సినిమాల్లో నటించారు. అవి సూపర్ హిట్‌లుగా నిలవడమే కాకుండా.. ఇద్దరి కెరీర్‌లను మలుపు తిప్పాయి.. తొలి సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆదివారం విజయ్ ప్రమాణం చేస్తుండగా.. త్రిష కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అయితే విజయ్ సిఎం అయిన తర్వాత త్రిష తొలి పోస్ట్ పెట్టారు. నీలిరంగు చీరలో ఆమె ఫోటోలను షేర్ చేశారు. దీనికి ‘‘ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది’’ అని క్యాప్షన్‌ని జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎస్ భార్య హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. మొత్తం 10 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..హత్యలో కీలక పాత్ర పోషించిన పనిమనిషి కల్పనను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరబాద్, పుణె, ముంబై, ఢిల్లీ, బిహార్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్‌కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. […] The post ఐపీఎస్ భార్య హత్య..పనిమనిషి కల్పన అరెస్ట్..? appeared first on Navatelangana.


అమరావతి: అమరావతి నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ భారత్ లో మోడల్ గా నిలుస్తుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జెఐఎస్ సి మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు నుంచి మద్దతు, విధానాల ఖరారుకు జెఐఎస్ సి లోకేష్ కోరారు. ఎఇఆర్ అభివృద్ధికి ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్ పిపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని లోకేష్ తెలియజేశారు. పెట్టుబడులకు ఇన్వెస్టర్ల లో విశ్వాసాన్ని పెంచుతుందని, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశాలు పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తరహాలో ఎపి ఒక గ్లోబల్ ఎంఐసిఇ గమ్యస్థానంగా మారాలన్నదే లక్ష్యమని, ఎపిలో అలాంటిది ఏర్పాటుకు సింగపూర్ సన్ టెక్ సిటీని అధ్యయనం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.

నవతెలంగాణ-హైదరాబాద్: ఆదివారం టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎడప్పాడి కె పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం, ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖ నాయకులతో పాటు, తమిళనాడు మంత్రులైన ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున, కెజి అరుణ్‌రాజ్, కెఎ సెంగోట్టయ్యన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ […] The post తమిళనాడులో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – బజార్ హత్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక తహసిల్దార్ శ్యాంసుందర్ సూచించారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన ఫారాల్లో ఉన్న 75 రకాల ప్రశ్నలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి క్షుణ్ణంగా నమోదు చేయాలని అన్నారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, […] The post ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలి: తహసిల్దార్ శ్యాంసుందర్ appeared first on Navatelangana.