5533 articles








చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తో గవర్నర్ అర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా కెఎ సెంగొట్టియన్, పి వెంకటరమణ, ఆర్ నిర్మల్ కుమార్, రాజమోహన్, కె ప్రభు, సెల్విఎస్, కీర్తన ఎన్. ఆనంద్, ఆదవ ఆర్జున్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్సెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించారు. గత 59 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె తమిళనాడు పాలిస్తూ వస్తున్నాయి. ద్రవిడయేతర ముఖ్యమంత్రిని ప్రజలు చూస్తున్నారు. తొలి సంకీర్ణ ప్రభుత్వంగా టివికె రికార్డుల్లోకెక్కింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
నవతెలంగాణ – చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. విజయ్‌తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్ కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి […] The post విజయ్ అనే నేను.. తమిళనాడు సీఎంగా ప్రమాణం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని వర్జీనియాలో నివాసముంటున్న హైదరాబాద్ యువతి ముద్దసాని వీణ (28) ఫ్లోరిడాలోని స్నేహితురాలి ఇంట్లో ఈతకొలనులో మృతి చెందింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, 2023 జూన్ 1న ప్రశాంత్‌రెడ్డిని వివాహం చేసుకున్న వీణ, ఆగస్టులో అమెరికా వెళ్లింది. ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసి, వచ్చే నెల 5న గృహప్రవేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 7న స్నేహితురాలి ఇంట్లోని ఫంక్షన్‌కు వెళ్లిన వీణ, అదే రోజు […] The post యుస్ లో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి హైదరాబాద్ యువతి మృతి appeared first on Navatelangana.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయి ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మాని టి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్8కె ఫార్మాట్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్ర మే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం విఫలమైనప్పుడు ‘మానిటీ’ ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ

ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ తన వింటేజ్ స్టైల్‌లో బలమైన కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. యంగ్ హీరో శర్వానంద్‌తో ఆయన ఓ భారీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. అయితే మొదట ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను టేకప్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే పనులు పూర్తయిన ఈ సినిమాను శ్రీను వైట్ల పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారట. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన దూకుడు, రెడీ, కింగ్ తరహా వినోదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో శ్రీను వైట్ల ఉన్నారట. శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ రెండింటినీ బాగా ఉపయోగించేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని తెలిసింది. ఈ సినిమాతో శర్వానంద్‌కు పూర్తి కమర్షియల్ కామెడీ హిట్ ఇవ్వాలని డైరెక్టర్ బలంగా ఫోకస్ చేస్తున్నారట.

మాజీ క్రికెటర్ శివరామకృష్ణముంబై: ఐపిఎల్ 2026లో ఆటలో ప్రదర్శనకన్నా నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. మొన్న రాజస్థాన్ రాయల్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రికెటర్ల గదిలో ఈసిగర్(వేపింగ్) తాగుతూ కెమెరాకు చిక్కగా.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఏకంగా ఆటగాళ్లు ప్రయాణించే విమానంలో వేపింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మార గా పలువురు మాజీలు, క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ ఆటగాడు దీనిపై స్పందిస్తూ.. ‘చాహల్‌ను జైలో పెట్లాలని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినం గా శిక్షించాలని పేర్కొన్నాడు. భారత్‌లో వేపింగ్‌పై నిషేధం ఉంది. ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించడం చాలా చిన్న శిక్ష. నిబంధనలు ఉల్లఘించి చాహల్‌ను జైల్లో పెట్టాలి’ అని అన్నాడు.
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటక ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సుధాకర్ కొద్దికాలం క్రితం మోకాలి శస్త్రచికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. సర్జరీ అనంతరం ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఏప్రిల్ […] The post కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత.. appeared first on Navatelangana.

చెన్నై: ఐపిఎల్ 19 సీజన్ తుది దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని జట్లు భారీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. దీంతో మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. దాంతో లీగ్ వీక్షకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ జాబితాలో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు పూర్తయిన 43 మ్యాచ్‌ల్లోని డేటా ఆధారంగా, చెన్నై సూపర్ కింగ్స్ సగటున 308 మిలియన్ల వీక్షకులతో అగ్రస్థానంలో నిలిచింది.

ముంబై: 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరంకానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె తన సతీమణి దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రసవ సమయంలో తన సతీమణి పక్కన ఉండేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో ఆర్‌సిబితో మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ రాయ్‌పూర్ వెళ్లగా.. సూర్యమాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. కానీ, ఈ మ్యాచ్‌లకు సూర్య అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. మ్యాచ్ రోజే జట్టుతో చేరుతాడని తెలిపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో దూరం కాగా.. సూర్య జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఆర్‌సిబితో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడే విషయంపై క్లారిటీ లేదు. హార్దిక్ పాండ్యా ఆడకపోతే మళ్లీ సూర్యనే జట్టును నడిపించనున్నాడు.

భారతదేశం అనేక సంప్రదాయ వృత్తులకు నిలయం. గ్రామీణ సంస్కృతిలో ప్రతి వృత్తి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాంటి గొప్ప చేతి వృత్తులలో మేదరి వృత్తి ఒకటి. మేదరి వారు పేదవారి కలపగా పిలవబడే వెదురుతో వివిధ రకాల గృహోపయోగ వస్తువులను తయారు చేసే కళాకారులు. వీరు తయారు చేసిన వస్తువులను వీధుల్లో తిరుగుతూ లేదా వార సంతల్లో విక్రయిస్తారు. వీరిని తెలుగు రాష్ట్రాల్లో మేదరి లేదా మహేంద్ర అనే పేరుతో పిలుస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో మేధా, బురుడు, గడబ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు- ఒక సాంప్రదాయ కళా సంపద. మేదరులు ప్రకృతితో మమేకమై జీవించేవారు. అడవుల్లో లభించే వెదురు వారి జీవనాధారం. వెదురును సేకరించడం నుండి అది ఉపయోగకరమైన వస్తువుగా మారే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ దశలన్నింటిలోనూ మేదరి వారి అనుభవం, శ్రమ, నైపుణ్యం ఉంటుంది. వీరు తయారు చేసే వస్తువులు గ్రామీణ జీవనంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీరు గంపలు, బుట్టలు, చాటలు, సిబ్బులు, చంద్రికలు, పొనుకలు, విసనకర్రలు వంటి వస్తువులు తయారు చేస్తారు. ఇవి తయారు చేయడానికి ముందుగా అడవిలోంచి సరైన వెదురును ఎంచుకుంటారు. దానిని పగలగొట్టిన తర్వాత వె

మన తెలంగాణ/మోత్కూర్: గత ప్రభుత్వ హయాంలో సాదా బైనామా క్రింద భూమి పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి ద్వారా వెంటనే పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. అనాదిగా సాగులో ఉన్న భూములకు కూడ ఇప్పటికి పట్టా హక్కులు లేకపోడం బాధాకరమైన విషయమని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామా ధరఖాస్తులను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడ ఆశలు చూపిస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. మండలంలోని వివిధ గ్రామాలలో వందల ఎకరాలు సాగులో ఉన్నప్పటికీ రైతులకు హక్కులు లేవని గుర్తుచేశారు. వెంటనే సాగు చేసుకుంటున్న రైతులకు భూబారతి ద్వారా హక్కులు కల్పించి, పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు వరి దాన్యాన్ని కళ్లాలో పోసి కొనుగోలు కోసం పడిగాపులు పడుతున్నారని, అదునుగా బావించిన మిల్లర్లు తాలు తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. వెంటనే దోపిడీని అరికట్టి కొనుగోలు వేగవంతం చేసి మద్దత్తు ధరకు ప్రభుత్వం కొను
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానుండటంతో దీనికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ గాంధీ ఉదయం 8:40 […] The post విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

ప్రజా పాలనకు రెండు చక్రాలు మానవ సమాజ నిర్మాణంలో ప్రభుత్వం ఒక వ్యవస్థ అయితే, ఆ వ్యవస్థకు ప్రాణం పోసేది ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ. పాలనను రూపకల్పన చేయడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఆ పాలనను ప్రజల గడపదాకా తీసుకెళ్లి జీవన విధానంగా మార్చేది ఉద్యోగస్థులే. అందుకే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం కేవలం విధి నిర్వహణకే పరిమితం కాదు. అది పరస్పర విశ్వాసం, బాధ్యత, సహకారం, సామాజిక నిబద్ధతలతో కూడిన అవినాభావ బంధం. మే 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జెఎసి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశం ఈ బంధానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. మనసా వాచా కర్మణా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం, ఉద్యోగస్థులు తొలిసారిగా అంత స్వేచ్ఛగా, భావోద్వేగంతో, పరస్పర అవగాహనతో మాట్లాడుకోవడం విశేషం. పరిపాలనలో ఉద్యోగస్థుల పాత్ర, ప్రభుత్వ బాధ్యత, ప్రజాసంక్షేమం పట్ల ఇరువురి కర్తవ్యాలను ఎంతో స్పష్టంగా ఈ సమావేశం ఆవిష్కరించింది. సిఎం తన భావోద్వేగ ప్రసంగంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగస్థులకు ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందేలా నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రత, వారి గ
నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. రైతు రోసపుల్ల రాజు (41) బావిలోకి దిగి దూడను రక్షించగా, బయటకు వస్తుండగా విషవాయువుల ప్రభావంతో మళ్లీ బావిలో పడిపోయాడు. తండ్రిని కాపాడేందుకు కుమారుడు పవన్‌కుమార్ (21) కూడా బావిలోకి దిగాడు. అయితే బావిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఇద్దరూ అస్వస్థతకు గురై నీటిలో మునిగి మృతి చెందారు. […] The post బావిలో దూడను కాపాడి.. తండ్రీకొడుకులు మృతి appeared first on Navatelangana.
తమిళనాడులో రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం నిన్నటి వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయ్‌ను సీఎంగా చూడాలన్న కోరిక నెరవేరడం ఆలస్యమవుతోందని 40 ఏండ్ల ఇసక్కియప్పన్ అనే కార్యకర్త మనస్తాపం చెంది శనివారం తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటికి నిప్పంటించుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలని […] The post విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం..నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్‌లో తమ నౌకలపై దాడులు జరిగితే అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు లక్ష్యాలుగా మారతాయని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. తమ క్షిపణులు ఇప్పటికే అమెరికా ఆస్తులను “లాక్” చేయాని తెలిపింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే […] The post అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ appeared first on Navatelangana.