5622 articles

నవతెలంగాణ-బొమ్మల రామారం: HCUలో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, విద్యార్థులపై దాడికి పాల్పడిన ABVP కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు అన్నారు… శుక్రవారం బొమ్మలరామారం మండలంలోని తుంకుంట చౌరస్తా నలంద హైస్కూల్లో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషల్ది లక్ష్యాల కలిగిన జెండాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటం నివాళులర్పించి శిక్షణ తరగతులు ప్రారంభించారు. […] The post HCUలో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం appeared first on Navatelangana.


నవతెలంగాణ–వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గుండాల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి “బీజేపీ గుండాలారా ఖబర్దార్” అంటూ నినాదాలు చేశారు. […] The post కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా వేములవాడలో బీఆర్‌ఎస్ ఆందోళన appeared first on Navatelangana.

నవతెలంగాణ–వేములవాడ: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ మంత్రి […] The post ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు… appeared first on Navatelangana.


న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిన కెకెఆర్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి మంచి జోరు మీద ఉంది. ఈ మ్యాచ్‌పై కూడా కెకెఆర్ కన్నేసింది. మరోవైపు ఢిల్లీ.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. తుది జట్లు: డిసి: పాతుమ్ నిస్సాంకా, కెఎల్ రాహుల్(కీపర్), నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్. అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, ముఖేశ్ కుమార్. కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ(కీపర్), కామరూన్ గ్రీన్, రొవ్‌మెన్ పొవెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా ఆర్‌సిబిపై ఎల్‌ఎస్‌జి ఘన విజయం సాధించింది. ఆర్‌సిబిపై ఎల్‌ఎస్‌జి తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్‌సిబి తొలుత బ్యాటింగ్ చేసి 203 పరుగుల లక్ష్యాన్ని ఎల్‌ఎస్‌జి ముందు ఉంచింది. ఎల్‌ఎస్‌జిలో మిచెల్ మార్ష్ సెంచరీ చేయడంతో తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రిన్ తన మొదటి ఓవర్ లో రెండో బంతిని లైన్ లెంగ్త్ వేయడంతో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ డకౌట్ కావడంతో తొమ్మిదేళ్లలో ఇదే తొలి సారి కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ చిట్కాను అతడిపై ప్రిన్స్ ప్రయోగించి సక్సెస్ అయ్యాడు. గత మ్యాచ్‌లో ఆర్‌సిబితో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో బౌలింగ్‌లో సూచనలు ఇవ్వమని ప్రిన్స్ యాదవ్ అడిగాడు. లైన్ లెంగ్త్‌లో సింగ్స్ చేస్తే వికెట్లు వస్తాయని చెప్పాడని ప్రిన్స్ చెప్పాడు. అదే చిట్కాను విరాట్ కోహ్లీపై ప్రయోగించడంతో అతడి వికెట్ దక్కిందని ప్రిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీలో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్ వికెట్‌ను ప్రిన్స్ తీశాడు. ప్రిన్స్ యాదవ్


ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి అతి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. అగ్రరాజ్యంలో చదవు పూర్తి చేసుకొని పట్టా అందుకున్న మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. 26 ఏళ్ల మహమ్మద్ కుమెల్ షేక్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవలే స్నాతకోత్సవం జరగ్గా.. తన గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అయితే ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులు దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతి పట్ల అమెరికాలోని భారత కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కుమెల్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.



– నీటిపారుదల శాఖ ఈఈ మోడెం సత్యనారాయనవతెలంగాణ-తుంగతుర్తిరైతులకు సాగునీరు అందించడం, నీటి వృధాను అరికట్టడం, కాలువల్లో పూడికతీత, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి నీటిపారుదల శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈఈ మోడెం సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గుగులోత్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ […] The post సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం appeared first on Navatelangana.

నవతెలంగాణ – ఆలేర్ రూరలప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్,పిఎసిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం ప్రారంభించారు.శిబిరంలో భాగంగా 35 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స అందించడంతో పాటు లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.అలాగే వేసవికాలంలో పశు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు […] The post ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌను మే 10న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తెలంగాణలో వేలకోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో శ్రీకారం చుట్టానున్నట్లు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారులకు అత్యధిక బడ్జెట్ కేటాయించి, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పనులు, వరంగల్లోఎయిర్ పోర్ట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తో మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ తదుపరి సాయంత్రం నాలుగు […] The post ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.

కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో జరిగిన శాసనసభాసక్ష సమావేశంలో పశ్చిమ బెంగాల్ సిఎంగా సువేందు పేరును అమిత్ షా ప్రకటించారు. శనివారం బెంగాల్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్ సోదరుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సామాజికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ హాజరై, నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, నల్ల […] The post చిందం మల్లిఖార్జున్ సోదరుని వివాహానికి హాజరైన ర్యాకల appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో ఈనెల 20వ తేదీన జరుగు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభ విజయవంతం చేయాలని, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కవెంకటేష్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. మాహాసభకు కాన్రాజ్ శీను అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ కల కల కోసం కాదు, కల ప్రజల కోసం అని చెప్పారు. నైజాం పోరాటంలో పాటలు రాసి ఆటలాడి ప్రజలు చైతన్యం చేసి, భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం […] The post ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్: తన సొంత నియోజకవర్గమైన కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కోడంగల్ చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు. కృష్ణా జలాలతో కోడంగల్ భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కోడంగల్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర […] The post కోడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినా విషయం తెలిసిందే. ఈక్రమంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా బ్లాక్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకే, కాంగ్రెస్ కలిసి ప్రచారం చేశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదు స్థానాల్లో గెలిచిన హస్తం అభ్యర్థులు.. విజయ్ అభ్యర్థన మేరకు టీవీకేకు […] The post కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు కట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు మే 9, 2026 (శనివారం) ఉదయం 11:00 గంటలకు.. కోల్‌కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు, […] The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..! appeared first on Navatelangana.


