🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5637 articles

రేవంత్ రెడ్డి కి పబ్లిసిటీ తప్ప పాలన లేదు: హరీష్ రావు
Telangana

రేవంత్ రెడ్డి కి పబ్లిసిటీ తప్ప పాలన లేదు: హరీష్ రావు

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నేరాలు, ఘోరాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రోజుకు 6 మంది పిల్లలు మిస్సింగ్, కిడ్నాప్ లలో 70శాతం బాలికలేనని అన్నారు. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు దిగజారాయని, హ్యూమన్ ట్రాఫికింగ్లోనూ తెలంగాణ టాప్ అని మహిళలపై నేరాలు 24,495 కి పెరిగాయని క్రైమ్ రేట్ జాతీయ సగటు కంటే ఎక్కువ అని తెలియజేశారు. కమాండ్ కంట్రోల్ లో కూర్చుని రేవంత్ ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పబ్లిసిటీ తప్ప పాలన లేదని, రేవంత్ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న నేరాలకు హోంమంత్రి, రేవంత్ బాధ్యత వహించాలని హరీష్ రావు సూచించారు.

Admin9 days ago👁 0
ఫాన్స్‌కి శుభవార్త.. ‘ధురంధర్-2’ ఒటిటి రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Telangana

ఫాన్స్‌కి శుభవార్త.. ‘ధురంధర్-2’ ఒటిటి రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. 2025 డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. విడుదలైన మొదటి షో నుంచి సూపర్‌హిట్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు ఒటిటిలోకి వస్తే చూసేద్దామని ఎదురు చూస్తున్నారు. తాజాగా ధురంధర్-2 ఒటిటి రిలీజ్‌ డేట్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇది కేవలం ఓవర్‌సీస్‌లో మాత్రమే. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 52 నిమిషాలుగా ఉంటుందని నె‌ట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే భారత్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి ఇప్పటికైతే సమాచారం లేదు. అయితే మే 15 నుంచి ఈ సినిమా ఇండియాలో ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై ఇంకా జియో హట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం
Telangana

పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం

నవతెలంగాణ-మిడ్జిల్ హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పీఏసీఎస్ పాలకవర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పోలే శ్రీధర్ భాస్కర్ రెడ్డి, నరసింహ, మల్లయ్య, రాములు, పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సివో బాల్ రెడ్డి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమంతో పాటు సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని పేర్కొన్నారు. […] The post పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం appeared first on Navatelangana.

త‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ
Telangana

త‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త‌మిళ‌నాడులో రాజ‌కీయ ఉత్కంఠ కొన‌సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధిక స్థానాలు సాధించిన ప్ర‌భుత్వ ఏర్పాట‌కు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌(118)కు స్వ‌ల్ప దూరంలో ఉన్న‌ది. ఐదుగురు ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చినా స‌రిప‌డ‌ని మెజార్టీ ల‌భించ‌లేదు. ఈక్ర‌మంలోనే సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క సమావేశంలో నిర్వ‌హించారు. చెన్నైలోని పార్టీ కార్యాల‌యంలో ఇరుపార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశమైయ్యారు. ఈ భేటీతో టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని తెల‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఐ(ఎం) […] The post త‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ appeared first on Navatelangana.

ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్
Telangana

ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్

నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రములోని గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనులను ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలు ఉదయం త్వరగా పనులకు రావాలని సూచించారు. నిబంధనల అనుసారం కొలతలు ఎఫ్ఏలు ఇచ్చిన విదంగా పనులు నిర్వహించాలని అన్నారు. పని ప్రదేశంలో త్రాగునీరు, హెల్త్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలి ఎఫ్ఏ , మేట్లను ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేసినప్పుడే పూర్తిస్థాయిలో […] The post ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్ appeared first on Navatelangana.

మాజీ డిజిపి భార్యను హత్య చేసింది నేపాలీ వాళ్లే: సిపి సజ్జనార్
Telangana

మాజీ డిజిపి భార్యను హత్య చేసింది నేపాలీ వాళ్లే: సిపి సజ్జనార్

హైదరాబాద్: మాజీ డిజిపి విజయ్ రంజన్ రే భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. నేపాలి గ్యాంగ్ ఈ హత్య చేసి ఉంటుందని ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని, కొన్ని క్లూస్ లభించాయి ఆ క్లూస్ ఆధారంగా వర్కౌట్ చేస్తున్నామని, నేపాలి పని వాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారని, రాత్రి మాజీ డిజిపి ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ హత్య చేసిందన్నారు. ఘటన సమయంలో పిల్లలు ఇద్దరు పైనే ఉన్నారని, తనుజ గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రిస్తున్నారని, ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డారని వివరించారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటామని, ప్రజలు ఆందోళన చెందవద్దని, నేపాలి మనుషులు ఇంట్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలన్నారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసిందని వివరించారు. మాజీ డిజిపి తల్లి కోసం ఆమె హైదరాబాద్ క

పడంపల్లిలో పశువులకు టీకాల పంపిణీ
జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షా సమావేశం
Telangana

జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షా సమావేశం

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ శ్రీనివాస్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సెల్ప్ హెన్యుమరేషన్, ఉపాధి హామీ లేబర్ మొబలైజేషన్, చలివేద్రం ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు త్రాగు పీటీఐ సమస్యలు తలెత్తకుండా గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు గ్రామాలలో ప్రజలకు […] The post జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షా సమావేశం appeared first on Navatelangana.

ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”
Telangana

ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”

నవతెలంగాణ – అశ్వారావుపేట స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శుక్రవారం మద్ది కొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాటి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలను రైతు పొలాల దాకా తీసుకెళ్లేందుకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతులను రైతులు అమలు చేస్తే […] The post ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” appeared first on Navatelangana.

కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం: రేవంత్
Telangana

కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం: రేవంత్

హైదరాబాద్: పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ బిడ్డ తెలంగాణకు సిఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. కొడంగల్ లో సిఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 110 కోట్లు, రూ.255 కోట్లతో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజు 18 గంటలు కష్టపడుతున్నా..ఇంకా సమస్యలున్నాయని, కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన తీసుకెళ్లామని తెలియజేశారు. కొడంగల్ అభివృద్ధి కోసం అంతా కలిసి వస్తున్నారని, కొడంగల్ లో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని సూచించారు. వికారాబాద్- కృష్ణా రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రాష్ట్రంలో నలుమూలల నుంచి మంచి చదువు కోసం విద్యార్థులు కొడంగల్ కు వస్తున్నారని అన్నారు. కోస్టి నుంచి ఎయిర్ పోర్టు వరకు 300 ఫీట్ల రోడ్ వస్తుందని, కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్ లో రాజకీయాలు పక్కన పెట్టాలని.. అభివృద్ధి కోసం అందరూ ప

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితేనే పాలన సులభతరం : చంద్రబాబు
Telangana

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితేనే పాలన సులభతరం : చంద్రబాబు

అమరావతి: పాలనకు టెక్నాలజీతో పాటు మానవతా దృక్పథం కూడా ముఖ్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెరగాలని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సిఎం సంతృప్తి చెందారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ ముఖ్యమైన అంశం అని ఫైళ్లను వెంటనే క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని తెలియజేశారు. 24 గంటల్లో ఇ- ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు, శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని, ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు ఆలోచించాలని సూచించారు.ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని అన్నారు. ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృథా కాదని, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి వాట్సాప్ లో అన్ని ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు చేపట్ట

విరాట్ ఇచ్చిన సలహాతోనే అతడిని ఔట్ చేశా: ప్రిన్స్
Telangana

విరాట్ ఇచ్చిన సలహాతోనే అతడిని ఔట్ చేశా: ప్రిన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్ జట్టు సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఆర్‌సిబిని ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఔట్ స్వింగర్ బంతిని అంచనా వేయలేక తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఐపిఎల్‌లో లక్ష్యఛేదనలో విరాట్ డకౌట్ అవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. అయితే విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాను అతడిపైనే ప్రయోగించి ఔట్ చేశానని ప్రిన్స్ తెలిపాడు. ‘‘ఈ సీజన్‌లో ఆర్సిబితో జరిగిన గత మ్యాచ్ అనంతరం విరాట్ భయ్యాతో నేను మాట్లాడాను. బంతి ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో స్వింగ్ అవుతున్నంతసేపు అదే లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఇప్పుడు తెలివిగా ఆ చిట్కానే పాటించి కోహ్లీని ఔట్ చేశాను’’ అని ప్రిన్స్ పేర్కొన్నాడు. ఈ పోరులో ప్రిన్స్.. కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బేతల్‌ను పెవిలియన్‌కు పంపి ఆర్‌సిబిని చావు దెబ్బ కొట్టాడు.

పేలిన అగ్నిపర్వతం.. 20 మంది గల్లంతు
జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి భార్య హత్య
రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య
Telangana

రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‍లో దారుణం చోటు జరిగింది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వర్టార్స్ లో ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే భార్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం విగతజీవిగా పడి ఉన్న రంజన్‍రే భార్యను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రంజన్‍రే భార్యను పని‍మనిషి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని సీటీ సీపీ సజ్జనార్ […] The post రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య appeared first on Navatelangana.

పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత బలోపేతం
Telangana

పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత బలోపేతం

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతను క్రెమ్లిన్ మరింత కట్టుదిట్టం చేసింది. కొన్నాళ్ల క్రితం నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఆయన ప్రయివేటు నివాసం వద్ద పుతిన్ హత్యకు ఉక్రెయిన్‌ ప్లాన్ చేసినట్టు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందన్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఖండించాయి. కాగా ఈ వార్తలతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని […] The post పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత బలోపేతం appeared first on Navatelangana.

హనీట్రాప్.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక
Telangana

హనీట్రాప్.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో హనీట్రాప్ ముప్పు పొంచి ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అనుమానం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, హోటల్ రూమ్‌లలోకి అనుమతి లేని వ్యక్తులను తీసుకురావద్దని సూచించారు. నియమావళి ఉల్లంఘిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. డగౌట్లు, బస్సులు, హోటళ్ల వద్ద ఆటతో సంబంధం లేని వ్యక్తులు తిరుగుతున్నారని అవినీతి నిరోధక విభాగం నివేదిక ఇచ్చింది. The post హనీట్రాప్.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక appeared first on Navatelangana.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..పలు బీసీ కులాల పేర్లు మార్పు
జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుంది
Telangana

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుంది

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి‘. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ “ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి... అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం”అని అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ “పోసాని ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజం

అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ కు గుండె సర్జన్ ప్రయాణం
Telangana

అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ కు గుండె సర్జన్ ప్రయాణం

ముల్లపూడి వెంకటరత్నం : ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్, హైదరాబాద్..ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం సేవ, త్యాగం మరియు మానవత్వానికి ఒక నిజమైన నిదర్శనం. 1937లో తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, 1962లో తన ఎంబిబిఎస్ విద్యను పూర్తి చేశారు. దృఢ సంకల్పం, కఠోర శ్రమతో, ఆయన అమెరికాకు వెళ్లి, న్యూయార్క్‌లోని ఆల్బనీ మెడికల్ సెంటర్‌లో కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రత్యేకత సాధించారు. అక్కడ ఆయన ఒక ప్రఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణుడిగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు.విదేశాలలో ఎంతో సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు డాక్టర్ వెంకటరత్నం భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. తన భార్య డాక్టర్ నళిని ముల్లపూడితో కలిసి, ఖరీదైన గుండె చికిత్సలను భరించలేని పేద రోగులకు సేవ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ఆయన స్వదేశానికి వచ్చారు. 1995 నుండి 1997 వరకు ఆయన ఎటువంటి జీతం తీసుకోకుండా నిమ్స్ లో పనిచేశారు. వైద్యం అనేది తనకు వ్యాపారం కాదని, అది కేవలం మానవత్వమేనని ఆయన నిరూపించారు.అమెరికాలో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో 19 ఏళ్ల వయసులోనే తన ప్రియ

మార్పు కోరిన యువతరం
Telangana

మార్పు కోరిన యువతరం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టివికె) అనూహ్యంగా అఖండ విజయం సాధించడం 1977 నుంచి రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రెండు ద్రవిడ దిగ్గజాల పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకె భవిష్యత్‌పై ఆలోచింపచేస్తోంది. 134 నియోజకవర్గాల్లో టివికె, డిఎంకె, ఎఐఎడిఎంకె ఓట్ల శాతాలను విశ్లేషిస్తే ఈ పార్టీలన్నీ ఒకదానికొకటి ఢీకొనినప్పటికీ ఎఐఎడిఎంకె అస్తిత్వానికి ముప్పు ఎదురైనట్టు స్పష్టమవుతోంది. ఎఐఎడిఎంకె ఓటు బ్యాంకుకు టివికె భారీగా గండి కొట్టింది. ఈ త్రిముఖ పోటీలో డిఎంకె తన ఓటుబ్యాంకును భారీగా నిలబెట్టుకోగలగడం విశేషం. అధికారంలో ఉన్న డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తన స్వంత కొలత్తూరు నియోజకవర్గం నుంచి మాజీ డిఎంకె నాయకుడు, టివికె అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పొందిన సిట్టింగ్ ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కుతారు. ఓటర్ల మొగ్గు ఈ విధంగా మార్పు చెందడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క కొలత్తూరు నియోజకవర్గానికే పరిమితం కాలేదు. మొత్తం 134 నియోజకవర్గాల్లోనూ కనిపించింది. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించి డిఎంకె మద్దతు ఇచ్చిన వారు కూడా టివికె వైపు మొగ్గుచూపారు. ప్రముఖ సినీ నటుడు,

మీడియా నైతికతకు మారుపేరు
Telangana

మీడియా నైతికతకు మారుపేరు

మీడియా విశ్వసనీయత, నైతికత, సామాజిక బాధ్యతలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న ఈ సమయంలో, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు జీవితం మళ్లీ ఆశ్చర్యకరమైన సమకాలీన ప్రాధాన్యంతో ముందుకు వస్తోంది. భారతీయ జర్నలిజం చరిత్రలో అపూర్వ ముద్ర వేసిన ఈ మహనీయుడి 160వ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలు, విలువలు, దూరదృష్టిపై మరోసారి దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఆంధ్రపత్రిక స్థాపకుడిగా చిరస్మరణీయులైన పంతులు, భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో పత్రికా శక్తిని ప్రజల్లో రాజకీయ చైతన్యం, సామాజిక అవగాహన కలిగించే సాధనంగా వినియోగించారు. కాలక్రమంలో ఆంధ్రపత్రిక కేవలం ఒక వార్తాపత్రికగా మాత్రమే కాకుండా, తెలుగు సమాజానికి సాంస్కృతిక, రాజకీయ స్వరంగా రూపాంతరం చెందింది. ఆయన సేవలు కేవలం జర్నలిజంకే పరిమితం కాలేదు. అమృతాంజనం అనే బ్రాండ్‌ను నిర్మించడం ద్వారా అసాధారణ వ్యాపార దూరదృష్టిని కూడా ప్రదర్శించారు. ఆ ఆర్థిక బలం ఆయన జాతీయ, సామాజిక ఆశయాలకు అండగా నిలిచింది. జర్నలిజం, జాతీయవాదం, వ్యాపార దూరదృష్టి - ఈ మూడింటి సమన్వయానికి ఆయన జీవితం అరుదైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక జయంతిని పురస్కరించుకుని, కథా రచయిత,- నిర్మాత శివలెంక పావని ప్రసాద్

ఆ కులాలకు పేర్లు మార్పు... పర్యాయ పదాలు చేర్చాం: పొన్నం
Telangana

ఆ కులాలకు పేర్లు మార్పు... పర్యాయ పదాలు చేర్చాం: పొన్నం

హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బిసి కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితా లోని కొన్ని కులాలు పేర్ల మార్పు, పర్యాద పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 1.గ్రూప్ - ఏ లో వరుస సంఖ్య 7 లో " దొమ్మర" అనే పదాన్ని తొలగించి "గడ వంశీయ" గా మార్పు2.గ్రూప్ - ఏ లో వరుస సంఖ్య 18లో ఉన్న "పిచ్చకుంట్ల" అనే పదాన్ని తొలగించి " వంశ రాజ్ గా మార్పు" 3 గ్రూప్ - డి లో వరుస సంఖ్య 29 లో ఉన్న "శూద్ర కులం" అనే పదాన్ని తొలగించి " తమ్మలి (బ్రాహ్మణేతర)" గా మార్పు 4. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 4 లో ఉన్న పద్ధుకు "శివ క్షత్రియ" పర్యాయ పదం గా చేర్చారు దీంతో "బుడబుక్కల శివ క్షత్రియ" గా మారుతుంది. 5.గ్రూప్ - ఏ లోని వరుస సంఖ్య 5 లో "వన్నార్ " ను తొలగించి "ధోబీ" ని చేర్చి రజక,చాకలి, దోబీ గా నమోదు చేయాలి 6. గ్రూప్ - డి లోని వరుస సంఖ్య 5 లో " మేరు" ను పర్యాయ పదంగా చేర్చి "మేర, మేరు, చిప్పోలు" గా నమోదు చేయాలి. 7. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 23 లొ ఉన్న "వీరభద్రియ( వీరముష్టి, నెట్టి కోటల) ను పర్యాయపదంగా చేర్చి వారి అభ్యర్థన మ

ప్రజాస్వామ్య విలువలపై  దీదీ ‘ధిక్కార’ నీడ!
Telangana

ప్రజాస్వామ్య విలువలపై దీదీ ‘ధిక్కార’ నీడ!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, ‘నేను దిగిపోను.. చేతనైతే గవర్నరే నన్ను బర్తరఫ్ చేయాలి’ అని వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే దానికి శాసనసభలో మెజారిటీ ఉండాలి. అంతకంటే ముఖ్యంగా, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి ఎన్నికలద్వారా ప్రజల మద్దతును పొంది ఉండాలి. ‘ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలతీర్పును శిరసావహించడం నాయకుడి కనీస బాధ్యత. బర్తరఫ్ చేయమని కోరడంద్వారా మమతా బెనర్జీ రాజకీయ లబ్ధి కోసం ‘విక్టిమ్ కార్డ్’ (బాధితురాలిగా చూపించుకోవడం) ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి, కానీ ఈసారి మమతా బెనర్జీ వైఖరి రాజ్యాంగ పరిమితులను దాటినట్లు కనిపిస్తోంది. పదవి కంటే ప్రజాస్వామ్య విలువలు గొప్పవని గుర్తించాల్సిన బాధ్యత ఒక ప్రజానాయకురాలిగా ఆమెపై ఉంది. ధిక్కార స్వరం వినిపించడం తాత్కాలికంగ

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA