గ్రీక్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్ యూరోబ్యాంక్ భారత్‌లో ప్రతినిధి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్-యూరప్ మధ్య పెరుగుతున్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కుదిరిన యూరోపియన్ యూనియన్-భారత్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం తర్వాత వ్యాపార సంబంధాలు మరింత బలపడనున్నాయి.

గ్రీక్, సైప్రస్ దేశాలను యూరప్‌లోకి భారత కంపెనీలకు ప్రవేశ ద్వారాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యూరోబ్యాంక్ ముందుకు వస్తోంది. ఇప్పటికే గ్రీస్‌లో ఉన్న భారతీయుల కోసం యూపీఐ ద్వారా క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో సలహా సేవలు, ట్రేడ్ ఫైనాన్స్ సేవలపై దృష్టి పెట్టనున్న బ్యాంక్, అధిక సంపన్నులు మరియు ఫ్యామిలీ ఆఫీసులను సైప్రస్‌లో పెట్టుబడులకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.