ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ వేసిన కీలక కేసులో పరాజయం ఎదురైన కేవలం ఒక రోజు తర్వాతే, కంపెనీ ఇప్పుడు భారీ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, సెప్టెంబర్ నాటికి ఓపెన్‌ఏఐ పబ్లిక్ కంపెనీగా మారేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ బ్యాంకులతో కలిసి ఐపీఓ పత్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో స్పేస్‌ఎక్స్ ఐపీఓ వార్తలు కూడా వెలువడుతున్నాయి.

ఎలాన్ మస్క్‌కి చెందిన xAI ఇప్పుడు ఓపెన్‌ఏఐకి ప్రధాన ప్రత్యర్థిగా మారడంతో, మస్క్ వర్సెస్ ఆల్ట్‌మన్ పోరు ఇప్పుడు టెక్నాలజీ నుంచి ఫైనాన్స్ ప్రపంచానికి చేరింది. ఈ రెండు కంపెనీల్లో ఏది అతిపెద్ద ఐపీఓ అవుతుందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.