స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్న వేడుకలో ఈ జంట మరోసారి వివాహ ప్రమాణాలను చేసుకున్నారు.
ఈ వేడుకకు “ది సీక్వెల్” అనే పేరు పెట్టినట్లు సమాచారం. రెండు దశాబ్దాల తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ జ్యోతిక భావోద్వేగంగా ప్రమాణాలు చేశారు. ప్రేమ, అవగాహన, పరస్పర అనుబంధాన్ని ప్రతిబింబించిన ఈ వేడుకకు సంబంధించిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.














