విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో కనిపించనున్న రష్మిక తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. గతంలో హిప్ గాయం కారణంగా కొంతకాలం షూటింగ్‌కు దూరమైన ఆమె, కోలుకున్న తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టి మిగిలిన సన్నివేశాలను పూర్తి చేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ దేవరకొండ ఆమెను ప్రత్యేకంగా హగ్ చేసుకున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా నటిస్తున్నారు.
‘రణబాలి’ షూటింగ్ పూర్తి చేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ స్పెషల్ హగ్

Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













