నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కథలోని ఎమోషన్, పాత్రల ప్రాధాన్యత తనను ఈ సినిమాకు ఆకర్షించాయని నాని తెలిపారు. ముఖ్యంగా సోనాలి కులకర్ణి పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్’కు మరో పేరు పెట్టాల్సి వస్తే ‘సమ్మక్క’ అని పెట్టొచ్చని అన్నారు. దీంతో సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతపై ఆసక్తి నెలకొంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కాయదు లోహర్, రాఘవ్ జుయల్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.














