నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘ఏషనాగుల’ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మీమ్స్‌లో ఈ పాటే ట్రెండింగ్‌గా మారింది. మాస్ బీట్స్, అదిరిపోయే రిథమ్‌తో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ‘ఏషనాగుల’ పాట యూట్యూబ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఐదు రోజుల్లో 50M వ్యూస్ మార్క్‌ను అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు.
రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్, నాని–కీర్తి సురేశ్‌ల మాస్ డ్యాన్స్ మూమెంట్స్ పాటకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లోనూ ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద నాని–శ్రీకాంత్ ఓదెల కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.








