ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శ్రీలీల.. చిన్నప్పటి నుంచే డాన్స్‌లో అదరగొట్టారట! కృష్ణాష్టమి సందర్భంగా తన 9 ఏళ్ల వయసులో చేసిన భరతనాట్య ప్రదర్శనకు సంబంధించిన చిన్ననాటి వీడియోను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కేవలం 3 ఏళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన శ్రీలీల.. 8 ఏళ్లకే తొలిసారి స్టేజ్‌పై తన ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆమె చూపించిన హావభావాలు, డాన్స్ మూమెంట్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన డాన్స్ టాలెంట్ చూపించిన శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.