అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందే “Most People Motion-Captured in Real-Time” విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ముంబయిలో సెప్టెంబర్ 15న నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లను మోషన్ క్యాప్చర్ చేశారు.
ఈ మోషన్ క్యాప్చర్‌లో నాలుగేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు పాల్గొన్నారు. 37 మంది కదలికలను ఒకేసారి ఖచ్చితంగా రికార్డు చేసేందుకు 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలతో పాటు అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.
ఈ ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అల్లు అర్జున్, అట్లీ అందుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. రాకా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.













