నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మాస్ టచ్‌తో ఆకట్టుకోగా.. ఇప్పుడు మూడో సింగిల్‌గా **‘అంజానా అంజానీ’**ను తీసుకొస్తున్నారు. ఈ పాట మెలోడీ ప్రధానంగా సాగనున్నట్లు సమాచారం.

ఇటీవల నాని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్టూడియో నుంచి ఓ చిన్న వీడియోను షేర్ చేస్తూ ఈ పాటపై ఆసక్తిని పెంచారు. సినిమాలో నాని పోషిస్తున్న జడల్ సుబ్బు పాత్ర ప్రేమకథకు ఈ పాటకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ది ప్యారడైజ్ 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.