దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ‘డీసీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా గత నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా విజయంతో నిర్మాత కళానిధి మారన్ చిత్ర బృందానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ అందించారు.

హీరో లోకేశ్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌లకు ఒక్కొక్కరికి ప్రీమియం బీఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఈ సినిమాతోనే లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్‌తో పాటు అనిరుధ్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి ఫీమేల్ లీడ్‌గా నటించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ప్రస్తుతం ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతోంది.