రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైసా. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సాహసోపేత అనుభవాల గురించి రష్మిక తాజాగా వెల్లడించింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు ఎత్తులంటే భయం ఉన్నప్పటికీ, సినిమా కోసం రిస్కీ సన్నివేశాల్లో నటించినట్లు తెలిపింది.
ఓ సన్నివేశం కోసం ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి దూకాల్సి వచ్చిందని, ఆ సమయంలో చాలా భయపడ్డానని రష్మిక చెప్పింది. అలాగే గంటల తరబడి నీటిలో షూటింగ్ చేయడం, బురదలో యాక్షన్ సన్నివేశాలు చేయడం కూడా ఎంతో కష్టంగా అనిపించిందని వెల్లడించింది. దర్శకుడి విజన్‌ను తెరపై చూపించేందుకు ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రష్మిక తెలిపింది.
రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న మైసాలో రష్మిక గిరిజన గోండు మహిళ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది.













