మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ‘ఓం: చాప్టర్ 1–ఉధిరం’ మేకర్స్. సెప్టెంబర్ 7న మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా.. సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ స్ట్రైక్, ‘అలా కా లూవా’ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా వచ్చిన మమ్ముట్టి గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
వీడియోలో ఇంటర్‌పోల్ అధికారులు మమ్ముట్టి పాత్ర కోసం వెతుకుతుంటే.. ఆయన మాత్రం ఏమీ పట్టనట్టుగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో అసలు మమ్ముట్టి పాత్ర ఏంటి? ఆయనకు ఇంటర్‌పోల్ ఎందుకు వెంటపడుతోంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ధనుష్ పాత్రతో మమ్ముట్టి పాత్రకు ఎలాంటి సంబంధం ఉంటుంది? వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.














