పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే అంటే అభిమానులకు ఓ పండగే! అందుకే అమెరికాలోని డల్లాస్‌లో మెగా ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రేషన్‌కు రెడీ అవుతున్నారు.

ఇండియాలో జరిగే మాస్ సెలబ్రేషన్స్‌ను తలపించేలా.. డల్లాస్‌లోని పవన్ కల్యాణ్ అభిమానులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి భారీగా బర్త్‌డే వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ మెగా ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సాయికుమార్ కూడా తన విషెస్ తెలిపారు. పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. డల్లాస్‌లోని మెగా ఫ్యాన్స్ అంతా ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 2న సాయంత్రం 7 గంటల నుంచి ది కాలనీ‌లోని Twisted Bar & Grill వేదికగా ఈ సెలబ్రేషన్ జరగనుంది.

WhatsApp Image 2026-09-02 at 7.17.56 PM.jpeg