తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా SANATHAN ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదర్శన సిద్ధమవుతోంది. “హర హర మహాదేవ” పేరుతో రూపొందించిన పూర్తి స్థాయి లైవ్ తెలుగు డ్రామా 2026 ఆగస్టు 1న అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఘనంగా జరగనుంది.
ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక నాటకం ఈస్ట్ బ్రన్స్‌విక్‌లోని JMPAC వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రదర్శించబడనుంది. మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రేక్షకులకు ప్రవేశం కల్పించనుండగా, 6 గంటల తర్వాత గేట్లు మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ లైవ్ డ్రామాలో శివపురాణంలోని ప్రసిద్ధ ఘట్టాలు రంగస్థలంపై జీవంతంగా ఆవిష్కరించబడనున్నాయి. ముఖ్యంగా లింగోద్భవం, దక్ష యజ్ఞం, పార్వతి కళ్యాణం, గంగావతరణం, గజాసుర సంహారం, రావణ దర్ప భంగం వంటి ఘట్టాలు ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తనున్నాయి.
ప్రదర్శన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సమాజం, కుటుంబాలు మరియు ఆధ్యాత్మిక భక్తులు భారీగా హాజరవుతారని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఆధ్యాత్మికత, కళా వైభవం, మరియు తెలుగు సంస్కృతి కలిసిన ఈ మహా వేదికకు హాజరై శివుని కృపను పొందాలని నిర్వాహకులు భక్తులను ఆహ్వానించారు.
Register Now:
VIP/VVIP: https://www.eventbrite.com/e/hara-hara-mahadeva-registration-1990457550114?aff=oddtdtcreator
General Admission: https://www.cognitoforms.com/Sanathan1/HaraHaraMahadevaShowTickets














