మన అమెరికా తెలుగు సంఘం -మాట ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న “మాటా 2వ కన్వెన్షన్–26” మహాసభల్లో ప్రవాస తెలుగువారికి ప్రత్యేకంగా లీగల్ ఫోరమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మహాసభలు జూన్ 19 నుండి జూన్ 20, 2026 వరకు గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జరగనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు లీగల్ ఫోరమ్ సదస్సు నిర్వహించనున్నారు.
ప్రవాస తెలుగువారికి ఎదురయ్యే వివిధ చట్టపరమైన సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, కుటుంబ సంబంధిత చట్టపరమైన సమస్యలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, అలాగే బిజినెస్ లా & నిబంధనల అమలు వంటి కీలక అంశాలపై నిపుణులు చర్చించనున్నారు.
ఈ సదస్సులో అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు మోడరేటర్లు మరియు ప్రెజెంటర్లుగా పాల్గొని సందేహాలను నివృత్తి చేయనున్నారు. సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండింగ్ పార్ట్‌నర్ సంతోష్ ఆర్. సోమిరెడ్డి, కంప్యూనెల్ ఇంక్ జనరల్ కౌన్సెల్ ప్రేమా రొద్దం, పటూరి లా ఫౌండింగ్ పార్ట్‌నర్ మధురిమ పటూరి వంటి నిపుణులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ లీగల్ ఫోరమ్‌కు ప్రేమా రొద్దం అడ్వైజర్‌గా, కళ్యాణి బెల్లంకొండ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రవాస తెలుగు సమాజానికి చట్టపరమైన అవగాహన పెంపొందించడమే ఈ ఫోరమ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.













