మిచిగన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) చాప్టర్ ఏర్పాటు కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులను ఆహ్వానిస్తూ ఐఓసీ ప్రతినిధులు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో నిర్వహించిన “వనభోజనాలు” కార్యక్రమంలో పాల్గొన్నారు. మేబరీ పార్క్‌లో జరిగిన ఈ పిక్నిక్ సందర్భంగా ప్రవాస భారతీయులతో మమేకమైన ఐఓసీ నాయకులు, జూన్ 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని సెయింట్ టోమా హాల్‌లో జరగనున్న ఐఓసీ మిచిగన్ చాప్టర్ ఏర్పాటు సభ వివరాలను తెలియజేశారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా RSVP నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మిచిగన్‌లో ఐఓసీ కార్యకలాపాలకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RSVP: https://bit.ly/IOC-MI-RSVP