ఏలూరు జిల్లా 2022లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుండి విడదీసి కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం ఏలూరు. కొల్లేరు సరస్సు, ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.







