అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రజలకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భారత్-అమెరికా సంబంధాలు ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, స్వేచ్ఛ వంటి ఉమ్మడి విలువలపై నిర్మితమయ్యాయని మోడీ పేర్కొన్నారు.
ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం ఇరు దేశాల స్నేహబంధం కీలక శక్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రమే కాకుండా, పరస్పర విశ్వాసం, ప్రజల మధ్య బలమైన అనుబంధానికి ప్రతీక అని అన్నారు.
1776 జూలై 4న బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించిన అమెరికా... ఈ ఏడాది తన 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.











