అమెరికా స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.
మౌంట్ రష్‌మోర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. అమెరికా సైన్యాన్ని ప్రశంసిస్తూ, కమ్యూనిజంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి కమ్యూనిస్టు భావజాలం పెద్ద ముప్పుగా మారుతోందని ఆయన ఆరోపించారు.
అమెరికానే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించిందని, రెండు ప్రపంచ యుద్ధాల్లో విజయం సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే కోల్డ్ వార్ తర్వాత అమెరికా శత్రువులు చరిత్రలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు.
వెనిజులాను ఒక్క రోజులో ఓడించామని, ఇరాన్‌పై కూడా గట్టి దెబ్బ కొట్టామని ట్రంప్ అన్నారు.
ఇరాన్ అంశంపై స్పందిస్తూ.. "టెహ్రాన్ ఇప్పుడు చర్చలకు రావాలని తహతహలాడుతోంది. అంత్యక్రియల కోసం మేము ఒక వారం సమయం ఇచ్చాం.. ఎందుకంటే మేము మంచి మనుషులం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.














