అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్న స్మారక నాణేలలో ఒక డాలర్ కాయిన్ డిజైన్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపాదిత డిజైన్‌లో ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ చిత్రం, మరో వైపు అమెరికా చిహ్నమైన ఈగిల్‌ను పొందుపరిచే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
అమెరికా నాణేల రూపకల్పనకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, సంప్రదాయాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అమెరికా ఫైన్ ఆర్ట్స్ కమిషన్ 250వ వార్షికోత్సవం సందర్భంగా ట్రంప్‌ను ప్రతిబింబించే 24 క్యారెట్ల స్మారక బంగారు నాణెం డిజైన్‌ను సమీక్షించినట్లు సమాచారం.
ఈ నాణెం కేవలం సేకరణదారుల కోసం విడుదల చేసే స్మారక ఉత్పత్తిగా ఉండే అవకాశం ఉందని, సాధారణ చలామణి నాణెంగా ఉంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.









