ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మూడు దేశాల గ్లోబల్ అవుట్‌రీచ్ టూర్‌లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విదేశాల్లోని పలు సంస్థల ఆహ్వానం మేరకు ఆయన అమెరికా, కెనడా, బ్రిటన్‌లో పర్యటించనున్నారు.

న్యూయార్క్ చేరుకున్న మోహన్ భగవత్‌కు ప్రవాస భారతీయులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో తిలకం దిద్ది ఆయనకు స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా మోహన్ భగవత్ భారతీయ ప్రవాసులతో పాటు వివిధ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో, వివిధ వర్గాలకు చెందిన ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు.