ఇంగ్లాండ్‌కు చెందిన వృద్ధ మహిళ బెట్టీ బ్రోమేజ్ మరోసారి తన సాహసంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గాల్లో ఎగురుతున్న విమానం రెక్కపై నిలబడి వింగ్ వాక్ చేస్తూ తన పాత గిన్నిస్ వరల్డ్ రికార్డును తానే బద్దలు కొట్టింది.
2025లో పక్షవాతం వచ్చినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయని బెట్టీ, తనకు చికిత్స అందించిన ఆస్పత్రికి నిధులు సమీకరించేందుకు ఈ సాహసాన్ని చేపట్టింది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసింది.
"వందేళ్లు వచ్చే వరకు ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉంటాను. బతికున్నప్పుడే నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం" అని బెట్టీ తెలిపింది. ఆమె ధైర్యసాహసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి.









