నేపాల్‌లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తీర్థయాత్రకు వెళ్లిన 80 మంది భక్తులు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్‌లో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆధ్యాత్మిక గురువు సద్గురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నేపాల్ తన హృదయానికి ఎంతో దగ్గరైన ప్రాంతమని సద్గురు తెలిపారు. ఈ విషాద వార్తను గ్రూప్ లీడర్ ప్రవీణ్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.
ఇక వేల ఏళ్లుగా కొనసాగుతున్న కైలాశ్ యాత్రకు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని.. ఈ యాత్ర నేపాల్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కీలకమని సద్గురు పేర్కొన్నారు.
మరోవైపు.. వరద బాధితులకు అండగా ఈషా ఫౌండేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఈషా నేపాల్.. నేపాల్ ప్రధానమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ.1 కోటి విరాళం అందించనుంది.
అంతేకాదు.. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం సెప్టెంబర్ 3న భారత్‌లోని ఈషా యోగా సెంటర్‌లో ‘కాలభైరవ కర్మ’ నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు.
ఇతర వరద బాధితుల వివరాలను కుటుంబ సభ్యులు అందిస్తే.. వారి కోసం కూడా ఈ కార్యక్రమంలో ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు.









