కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న SCO సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. కీలక అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజులు గడిచే కొద్దీ యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతుందని.. శాంతి కోసం వేసే ప్రతి అడుగు కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.
ఎంతకాలం కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అంశంపై పుతిన్‌తో గతంలోనూ పలుమార్లు చర్చించామని.. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు.
అలాగే.. అన్ని సమస్యలకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం రావాలన్నదే భారత్ సందేశమని మోదీ చెప్పారు. గాంధీ, బుద్ధుడి భూములైన భారత్.. ప్రపంచానికి శాంతి మార్గాన్నే సూచిస్తుందని పేర్కొన్నారు.
ఇక సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS సమ్మిట్‌కు పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. పుతిన్ పర్యటన భారత్-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
భేటీ అనంతరం మోదీ, పుతిన్ ఒకే కారులో World Nomad Games ప్రారంభోత్సవానికి వెళ్లారు.












