బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

సైమా వాజెద్‌పై ఆర్థిక అవకతవకలు, మోసం, పత్రాలకు సంబంధించిన అంశాల్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమెపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.2025లో ఆమెను వేతనం లేని పరిపాలనా సెలవుపై ఉంచారు. చైనా పర్యటన ఖర్చులు, విద్యార్హతల వివరాలు, బంగ్లాదేశ్‌లో భూమి కొనుగోలుకు సంబంధించిన అంశాలు కూడా వివాదానికి కారణమయ్యాయి.

తన రాజీనామా లేఖలో డబ్ల్యూహెచ్‌ఓ నాయకత్వంపై నమ్మకం కోల్పోయినట్లు సైమా పేర్కొన్నారు. చాలాకాలంగా వేతనం లేకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగా మారిందని తెలిపారు.సైమాను పదవి నుంచి తొలగించాలన్న సిఫారసు ప్రాంతీయ కమిటీ నుంచి వచ్చిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.