ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ చిన్నారి కోరికను నెరవేర్చారు. శ్రద్ధ అనే చిన్నారికి స్వయంగా వీడియో కాల్‌ చేసి ఆప్యాయతగా మాట్లాడారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.