క్రికెట్ అంటే మన దేశంలో ఒక వ్యసనం. ఐపీఎల్ అంటే ఒక పండగ. కానీ, సోమవారం నాడు ఉప్పల్ స్టేడియంలో జరిగిన దృశ్యాలు చూస్తే.. ఇది క్రికెట్ మ్యాచా లేక మరేదైనా క్షుద్ర పూజల వేదికా అనిపించక మానదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆనందం ఒకవైపు ఉంటే.. గ్యాలరీలో ఒక అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిమ్మకాయలు, మంత్రాలు, వికెట్లు.. ఇంతకీ ఆరోజు అసలు ఏం జరిగింది? నిజంగానే ఐపీఎల్ లో చేతబడి జరుగుతోందా? లలిత్ మోదీ చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.