డల్లాస్ గడ్డపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ‘డల్లాస్ గడ్డ.. పవన్ కల్యాణ్ అడ్డా’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. Dallas Mega Fans ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ది కాలనీలోని Twisted Bar & Grillలో పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలకు డల్లాస్‌లోని పవన్ కల్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులంతా ఒకే కుటుంబంలా కలిసి పవర్‌స్టార్ జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేక్ కటింగ్, డీజే నైట్, సంగీతం, డ్యాన్స్‌తో పాటు పలు వినోద కార్యక్రమాలు అభిమానులను అలరించాయి. అభిమానులు నలుపు రంగు దుస్తుల్లో హాజరై వేడుకలకు మరింత జోష్ తీసుకొచ్చారు.
పవన్ కల్యాణ్‌పై అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు కేరింతలు, నినాదాలతో సందడి చేశారు. దీంతో Twisted Bar & Grill మొత్తం పవర్‌స్టార్ నామస్మరణతో మార్మోగింది. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు డల్లాస్‌లోని పవన్ కల్యాణ్ అభిమానులకు మరపురాని జ్ఞాపకంగా నిలిచాయి.



















