విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ.. స్వీడన్ తెలుగు కమ్యూనిటీ (STC) దసరా & బతుకమ్మ వేడుకలు 2026 నిర్వహించేందుకు సిద్ధమైంది.

అక్టోబర్ 17, 2026, శనివారం నాడు స్టాక్‌హోమ్‌లోని Tensta Träff, Hagstråket 13, 163 63 Spångaలో ఈ వేడుకలు జరగనున్నాయి. కార్యక్రమాలు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు కొనసాగనున్నాయి.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను రూపొందించారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ మహిళలు, కుటుంబాలు కలిసి పూల బతుకమ్మలను అలంకరించి వేడుకల్లో పాల్గొననున్నారు.

🎉 కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణలు

🌸 బతుకమ్మ వేడుకలు
💃 సాంస్కృతిక ప్రదర్శనలు
👨‍👩‍👧‍👦 కిడ్స్ & ఫ్యామిలీ యాక్టివిటీస్
🏆 గేమ్స్ & ప్రైజెస్
📸 ఫోటో బూత్
🍛 సంప్రదాయ తెలుగు ఆహారం
🎶 మ్యూజిక్ & DJ

“Celebrating Culture | Strengthening Community | Together in Tradition” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

స్వీడన్‌లోని తెలుగు కుటుంబాలు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాలను జరుపుకోవాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. STC స్వీడన్‌లో తెలుగు భాష, సాహిత్యం, సంప్రదాయాలు, పండుగలను ప్రోత్సహిస్తూ కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి STC Long-Term Sponsorsగా Acumant, JSAN, Viljettech, VIPAS సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఈవెంట్‌కు స్పాన్సర్ కావాలనుకునే సంస్థలు swedentelugucommunity@gmail.com ద్వారా నిర్వాహకులను సంప్రదించవచ్చు.

📍 ఈవెంట్ వివరాలు

ఈవెంట్: దసరా & బతుకమ్మ వేడుకలు 2026
తేదీ: శనివారం, అక్టోబర్ 17, 2026
సమయం: మధ్యాహ్నం 2:00 – రాత్రి 9:00
వేదిక: Tensta Träff, Hagstråket 13, 163 63 Spånga, Sweden
ఆర్గనైజర్: Sweden Telugu Community (STC)

Screenshot 2026-09-24 084602.png