అమెరికాలోని ఫ్రిస్కోలో జరిగిన ఇండియన్ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఫెస్టివల్‌కు ఎన్నారైల నుంచి భారీ స్పందన లభించింది. NRI ONE ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీల్లో Hyatt Regency Frisco-Dallasలో ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వహించారు. భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఒకే వేదికపైకి వచ్చి.. అమెరికాలోని ఎన్నారైలకు భారత్‌లోని వివిధ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను పరిచయం చేశారు.
సొంత ఇల్లు, రిటైర్మెంట్ ప్లాన్ లేదా పెట్టుబడి లక్ష్యంగా భారత్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే ఎన్నారైలకు ఈ ఫెస్టివల్ ద్వారా ప్రాజెక్టులు, ప్రత్యేక ఆఫర్లు, నిపుణుల మార్గదర్శకత్వం అందించారు.
ఈ సందర్భంగా NRI ONE కో-ఫౌండర్ గౌరవ్ శర్మ Today Teluguతో మాట్లాడుతూ.. భారతదేశంలోని రియల్ ఎస్టేట్‌తో పాటు దుబాయ్ ప్రాపర్టీలపై కూడా ఎన్నారైల ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు.. వారి స్వదేశంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, నమ్మకమైన పెట్టుబడి అవకాశాలను అందించడమే NRI ONE లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇండియన్ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఫెస్టివల్ ద్వారా భారతీయ డెవలపర్లను గ్లోబల్ ఎన్నారై మార్కెట్‌తో అనుసంధానం చేస్తూ.. రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత విస్తరించే దిశగా NRI ONE ముందుకు సాగుతోంది.














