అమెరికాలోని ఫ్రిస్కోలో జరిగిన OGKTMA 39వ వార్షిక సదస్సు, సైంటిఫిక్ అసెంబ్లీలో NICE Foundation ప్రత్యేకంగా నిలిచింది. భారతదేశంలోని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థగా NICE Foundation తన సేవలను ఈ వేదికపై ప్రదర్శించింది.

ఏళ్లుగా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలను బలోపేతం చేస్తూ NICE Foundation పనిచేస్తోంది. ముఖ్యంగా తల్లులు, నవజాత శిశువులు, చిన్నారులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లకు అవసరమైన ఆరోగ్య సేవలు, అవగాహన, సహకారం అందించడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.

మారుమూల ప్రాంతాల్లో NICE Foundation సేవలు ఎంత విస్తృతంగా చేరుతున్నాయి. ఆరోగ్య సేవలు అందుబాటులో లేని వర్గాలకు వైద్య సహాయాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

OGKTMA సదస్సు వేదికగా NICE Foundation సేవలు, గ్రామీణ–గిరిజన ఆరోగ్య రంగంలో సంస్థ చేస్తున్న కృషి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది.