గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో 4వ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రక్తదాన శిబిరం జరగనుంది. ఫ్రిస్కోలోని 11625 Custer Rd, Ste 100 వద్ద ఉన్న Spicy Venue Parking Lotలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Carter BloodCare సహకారంతో నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డ్రైవ్‌లో పాల్గొని రక్తదానం చేయాలని GRADA నిర్వాహకులు కోరుతున్నారు. “వారి జీవితాలను గౌరవిస్తూ.. ప్రాణాలను కాపాడే బహుమతిని అందిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

రక్తదాన శిబిరానికి సంబంధించిన వివరాల కోసం (940) 278-8825 నంబర్‌ను సంప్రదించవచ్చు. అలాగే Uma Gorrepati (+1 945-217-7214), Hari Pogaku (+1 901-236-3506), Koti Guddeti (+1 224-277-1936)లను సంప్రదించవచ్చు.

సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్థానికులు, రాయలసీమ కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Image 2026-09-22 at 11.42.29 PM (1).jpeg