ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులకు వేదికగా నిలుస్తున్న మన అమెరికా తెలుగు సంఘం (మాటా) ప్రతిష్ఠాత్మక “మాటా 2వ కన్వెన్షన్–2026”లో ప్రత్యేకంగా “కవి సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలుగు జనపద సంప్రదాయం, సాహిత్య వారసత్వం, ఆధునిక భావజాలాన్ని ప్రతిబింబించే ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ జానపద పరిశోధకులు, ఆల్ ఇండియా రేడియో గాయకులు డాక్టర్ లింగా శ్రీనివాస్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖ కవులు, సాహితీవేత్తలు, జనపద కళాకారులు పాల్గొని తమ కవిత్వం, సాహిత్య అనుభవాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీ శేషగిరిరావు కంభంమెట్టు నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

కవి సమ్మేళనం జూన్ 20, 2026న మధ్యాహ్నం 4:00 గంటల నుంచి 5:00 గంటల వరకు, గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్లోని మీటింగ్ రూమ్-5లో జరగనుంది. మాటా కన్వెన్షన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యాభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుందని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Image 2026-06-15 at 6.45.45 PM.jpeg