అమెరికాలోని ఇండో-అమెరికన్ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్లు, పరిశ్రమల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AAA మరో కీలక అడుగు వేసింది. ABC – Andhrapradesh Business Community పేరుతో ప్రత్యేక బిజినెస్ వేదికను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇండో-అమెరికన్ సమాజంలో వేలాది మంది వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, కార్పొరేట్ నాయకులు, పెట్టుబడిదారులు, నిపుణులు ఉన్నప్పటికీ... వారి అనుభవం, పరిజ్ఞానం, పరిచయాలు, అవకాశాలు ఒకే చోట కలిసే వ్యవస్థ ఇప్పటివరకు లేకపోవడం వల్ల ఎంతో సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని AAA అభిప్రాయపడింది.

ఈ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా ABC రూపుదిద్దుకుంది. వ్యాపార అభివృద్ధి, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, మెంటార్‌షిప్, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల మధ్య సహకారం వంటి అంశాలకు ఇది ప్రధాన వేదికగా నిలవనుంది.

ABC ద్వారా సభ్యులు పరస్పర విశ్వాసంతో కూడిన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడం, అనుభవాలను పంచుకోవడం, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం, రిఫరల్స్, భాగస్వామ్యాలు, సహకార కార్యక్రమాలను విస్తరించడం వంటి అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే అమెరికాలోని వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వ్యాపారవేత్తలను ఒకే నెట్‌వర్క్‌లో అనుసంధానించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

అంతేకాదు... భవిష్యత్ తరాల యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కూడా ABC ముఖ్య ఉద్దేశ్యాల్లో ఒకటిగా సంస్థ వెల్లడించింది.

AAA చేపడుతున్న సమగ్ర కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ABCను తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించే సాంస్కృతిక కార్యక్రమాలు, యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు, మహిళా సాధికారత, సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవగాహన, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు ఇప్పుడు వ్యాపార, వృత్తిపరమైన అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

"ఒకే కమ్యూనిటీ... అనేక వేదికలు... అందరి అభివృద్ధే లక్ష్యం" అనే నినాదంతో AAA ముందుకు సాగుతోంది. ABC విజన్, నాయకత్వ బృందం, సభ్యత్వం, భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

"Connecting Opportunity... Empowering Growth" అనే సందేశంతో అమెరికాలో వ్యాపార ప్రపంచాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ABC – Andhrapradesh Business Community కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.

WhatsApp Image 2026-08-06 at 8.05.43 PM.jpeg