అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో భాగంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. ఈ ఆధ్యాత్మిక వేడుక ఆగస్టు 2, 2026 ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు.
ఈ పుణ్యకార్యక్రమానికి తెలుగు కుటుంబాలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ATA నిర్వాహకులు ఆహ్వానించారు. శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనదలిచిన వారి కోసం రిజిస్ట్రేషన్ ఫీజు 250 డాలర్లుగా నిర్ణయించారు. ఈ రుసుములో ఆగస్టు 2న జరిగే ATA కాన్ఫరెన్స్‌కు డే పాస్ కూడా అందజేయబడుతుంది.
ఈ దివ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ATA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అమెరికాలోని తెలుగు ప్రవాసులకు భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను మరింత చేరువ చేసే ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
















