అమెరికా స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో "అమెరికా 250 – ఎంగేజ్, ఎడ్యుకేట్, యునైట్" కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతీయ-అమెరికన్ సమాజానికి చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని పంచుకున్నారు.

పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, వెండర్ బూత్‌లు, పిల్లలు, కుటుంబాల కోసం ప్రత్యేక ఆకర్షణలు సందర్శకులను అలరించాయి.

ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమెరికా స్వాతంత్య్ర స్ఫూర్తి, సమాజ ఐక్యత, సేవా భావం గురించి ప్రసంగించారు.

ఈ వేడుక విజయవంతం అవటంలో ఐఏఎన్టీ అధ్యక్షుడు మహేందర్ రావు, ప్రెసిడెంట్-ఎలెక్ట్ దీపక్ కల్రా, వైస్ ప్రెసిడెంట్ శ్రేయాన్స్ జైన్, కార్యదర్శి డాక్టర్ జనాంతిక్ పాండ్యా (జేపీ), జాయింట్ సెక్రటరీ కలై కృష్ణమూర్తి, ట్రెజరర్ అమన్ సింగ్, జాయింట్ ట్రెజరర్ భారతి మిశ్రా, మాజీ అధ్యక్షుడు రాజీవ్ కామత్, డైరెక్టర్లు, బోర్డు సభ్యులు, ట్రస్టీలు, తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఫ్రిస్కో ఫ్లయర్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ వేడుక అమెరికన్ విలువలు, భారతీయ సంస్కృతి వైభవాన్ని ఒకే వేదికపై ఆవిష్కరిస్తూ విజయవంతంగా ముగిసింది.