అమెరికాలోని ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (APCO) ఆధ్వర్యంలో నిర్వహించిన పిక్నిక్ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఎంతో సందడిగా నిర్వహించారు.
పిక్నిక్‌లో ఆథెంటిక్ ట్రెడిషనల్ తెలుగు వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో పాటు ముఖ్యంగా ఇంటివద్ద తయారు చేసిన స్వీట్‌లను అందరికీ వడ్డించారు. సంప్రదాయ రుచులతో చిన్నారులు, పెద్దలు ఎంతో ఆనందంగా విందును ఆస్వాదించారు.
కార్యక్రమంలో యువతులు ప్రదర్శించిన ఎనర్జిటిక్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందమైన స్టెప్పులతో అమ్మాయిలు అలరించగా, వారి క్యూట్ డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
అలాగే చిన్నారుల కోసం నిర్వహించిన ఫన్ గేమ్స్, సరదా ఆటలు, వివిధ వినోద కార్యక్రమాలు పిక్నిక్‌లో సందడి పెంచాయి. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఆటలను ఆస్వాదించారు.
తెలుగు కుటుంబాలన్నీ ఒకే చోట చేరి ఆప్యాయంగా గడపడంతో APCO పిక్నిక్ సంతోషం, సంప్రదాయం, వినోదం కలగలిసిన గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది.









