అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA Conference & Youth Conventionలో "Building Tomorrow's Leaders – Preparing for Community and Political Leadership" అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ఆగస్టు 1, 2026 (శనివారం) సాయంత్రం 4:15 గంటల నుంచి 5:00 గంటల వరకు, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లోని రూమ్ నెం. 342లో జరగనుంది.
ఈ చర్చలో శ్రీధర్ నాగిరెడ్డి (మాజీ వర్జీనియా స్టేట్ సెనేట్ డెమోక్రటిక్ అభ్యర్థి), జాకబ్ హార్బర్ (ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ స్కూల్ బోర్డు డైరెక్టర్), లారెన్స్ రాబర్ట్స్ (సోరెన్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సివిక్ లీడర్‌షిప్ డైరెక్టర్) ప్యానెలిస్టులుగా పాల్గొననున్నారు.
ఈ చర్చకు మాజీ ఒహాయో సెనేటర్ నిరాజ్ ఆంటాని మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు. యువతలో కమ్యూనిటీ సేవా భావం, ప్రజా నాయకత్వ నైపుణ్యాలు, రాజకీయ అవగాహన పెంపొందించడంపై ఈ సెషన్ దృష్టి సారించనుంది.
ATA కాన్ఫరెన్స్‌లో యువత, కమ్యూనిటీ నాయకులు, ప్రజా సేవపై ఆసక్తి ఉన్న వారికి ఈ ప్యానెల్ చర్చ విశేషంగా ఉపయోగపడనుందని నిర్వాహకులు తెలిపారు.
ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.











