అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో యువతలో ప్రజాసేవా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో "The Next Generation of Public Service" అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం ఆగస్టు 1, 2026 (శనివారం) మధ్యాహ్నం 2:40 గంటల నుంచి 3:20 గంటల వరకు, మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో రూమ్ నం. 342లో జరగనుంది.

ఈ ప్యానెల్‌లో సుజిత్ కొప్పుల (వర్జీనియా సెనేటర్ కన్నన్ శ్రీనివాసన్ సీనియర్ అడ్వైజర్), విశ్వజిత్ మల్లంపాటి (i360 పొలిటికల్ మీడియా ప్లానర్), ఐశాని శ్రీవాస్తవ (డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ వర్జీనియా) పాల్గొని ప్రజాసేవలో యువత పాత్ర, రాజకీయ నాయకత్వ అవకాశాలు, ప్రజా విధానాల రూపకల్పన వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ఈ సెషన్‌కు సోరెన్సెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సివిక్ లీడర్‌షిప్ డైరెక్టర్ లారెన్స్ రాబర్ట్స్ మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.

అమెరికాలోని తెలుగు యువతకు ప్రజాసేవ, నాయకత్వం, రాజకీయాల్లో అవకాశాలపై అవగాహన కల్పించే ఈ చర్చ ATA మహాసభలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలవనుంది.

ఈ ప్రతిష్టాత్మక మహాసభలను ATA అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2026-07-27 at 5.48.39 PM.jpeg