అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో భాగంగా బిజినెస్ కమిటీ ఆధ్వర్యంలో "Mergers and Acquisitions (M&A) Panel" ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సదస్సు ఆగస్టు 1, 2026న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడనుంది. ఈ ప్యానెల్‌లో వ్యాపార విస్తరణ, సంస్థల విలీనాలు, పెట్టుబడులు, చట్టపరమైన అంశాలు, వ్యాపార వ్యూహాలు వంటి కీలక అంశాలపై ప్రముఖ నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్యానెల్‌లో Craig Chason (Partner, Pillsbury Law Firm), Gautam Ijoor (CEO, Alpha Omega & TEDx Speaker), Marybeth Wootton (Executive Advisor, CEO & Investor), Bob Kipps (Investment Banker, KippsDeSanto & Co.), Greg Popera (Managing Director, Merrill Lynch) పాల్గొని విలీనాలు, కొనుగోళ్లు, పెట్టుబడి అవకాశాలు, వ్యాపార అభివృద్ధిపై విలువైన సూచనలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి Rana Chegu, President, LBO Technology మోడరేటర్‌గా వ్యవహరించనుండగా, ATA Business Committee Chair Anil Boinapalli సమన్వయం చేస్తున్నారు.
జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ మహాసభలో వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ బిజినెస్ సెషన్ ఉత్తమ నెట్‌వర్కింగ్ వేదికగా నిలవనుంది. పాల్గొనదలచిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని ATA నిర్వాహకులు సూచించారు.
ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.












