ఫీనిక్స్ తెలుగు సంగీతాభిమానులకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) శుభవార్త అందించింది. ప్రతిష్ఠాత్మక ATA Conference & Youth Convention 2026లో భాగంగా నిర్వహిస్తున్న “ఝుమ్మంది నాదం” సోలో సింగింగ్ కాంపిటిషన్ కోసం ఫీనిక్స్‌లో పోటీలు జరగనున్నాయి.
జూన్ 14, 2026 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అరిజోనాలోని చాండ్లర్ నగరంలోని హామిల్టన్ హైస్కూల్ వేదికగా ఈ సంగీత పోటీలు నిర్వహించనున్నారు. జూనియర్స్ (7-14 సంవత్సరాలు), సీనియర్స్ (15 సంవత్సరాలు పైబడిన వారు) విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి అంకిత (సింహాద్రి ఫేమ్) సెలబ్రిటీ జడ్జిగా హాజరుకానుండటం విశేషం. విజేతలకు బాల్టిమోర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ వేదికపై ప్రముఖ సినీ తారల చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నారు.
పోటీల్లో పాల్గొనదలచిన వారు జూన్ 10, 2026లోపు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ATA సభ్యులకు నమోదు రుసుము $30 కాగా, సభ్యులు కానివారికి $50గా నిర్ణయించారు.
తెలుగు పాటలపై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువత తమ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించుకునే అరుదైన అవకాశమిదని ATA ప్రతినిధులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/ATAJummandiNaadam2026











