ఫిలడెల్ఫియా ప్రాంతంలో నిర్వహించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభించింది. జూన్ 13, 2026న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్‌లో ఉన్న స్టెట్సన్ మిడిల్ స్కూల్‌లో నిర్వహించిన "ఝుమ్మంది నాదం", "సయ్యంది పాదం" మరియు బ్యూటీ పేజెంట్ పోటీలలో 150 మందికిపైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

వివిధ విభాగాల్లో జరిగిన ఈ పోటీలను 10 మందికిపైగా ప్రముఖ న్యాయనిర్ణేతలు మూల్యాంకనం చేశారు. విజేతలు, రన్నరప్‌లకు ATA ట్రోఫీలు అందజేయడంతో పాటు, 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత కల్పించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రాంతీయ డైరెక్టర్ అరుణ్ రుద్ర, ఝుమ్మంది నాదం చైర్మన్ ముజీబిర్ రెహ్మాన్, లోకల్ కోఆర్డినేటర్ శ్రావణి రుద్ర, ఉమెన్ కోఆర్డినేటర్ నీలవాణి కందుకూరి కీలక పాత్ర పోషించారు.

ATA మాజీ అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యుడు రాజు కక్కెర్ల మార్గదర్శకత్వం అందించగా, ప్రాంతీయ కోఆర్డినేటర్లు ప్రమోద్ సంగాని, వేణు బండి, వంశీ యంజాల కార్యక్రమ నిర్వహణలో సహకారం అందించారు.

ఈ సందర్భంగా విజేతలు, రన్నరప్‌లు, పోటీదారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలు, వాలంటీర్లకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంలో ATA నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.